Sai Pallavi: సాయిప‌ల్ల‌వికి ఇష్ట‌మైన తెలుగు హీరో ఎవరంటే..?

by Phanindra |   (  Updated:2025-02-10 09:05:04  IST  )

అతనంటే ఎందుకు ఇష్టమో కూడా చెప్పింది

Sai Pallavi: సాయిప‌ల్ల‌వికి ఇష్ట‌మైన తెలుగు హీరో ఎవరంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని సాయి పల్లవి ( Sai Pallavi ) వరుస సినిమాలను ఫుల్ బిజీ అయింది. అమరన్ మూవీతో పెద్ద హిట్ అందుకుని, ఇప్పుడు తండేల్ తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ముద్దుగుమ్మ చాలా నేచురల్ గా చేస్తుంది ఏదైనా. హీరోయిన్ అనే పొగరు, గర్వం అలాంటివి ఏమీ ఉండవు. సినీ ఇండస్ట్రీలోనే ఈమె చాలా డిఫరెంట్. ఏ పాత్ర చేసిన దానిలో జీవిస్తుంది. ప్రస్తుతం, తండేల్‌ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది.

అయితే, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో ( Tollywood ) తన ఫేవరేట్ హీరో ఎవరో బయటకు చెప్పింది. అసలు, అతనంటే ఎందుకు ఇష్టమో కూడా చెప్పింది. మరి, ఆయనెవరో ఇక్కడ తెలుసుకుందాం..

తనకు అందరికంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అంటే చాలా చాలా ఇష్టమని, ఆయన సినిమాలు అన్ని చూస్తానని చెప్పింది. ఆయన స్టార్ అయినా కానీ అలా ఉండరు, చాలా సింపుల్ గా ఉంటారు, చాలా ఈజీగా అందరితో కలసి పోతారని తెలిపింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు .. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అంటే ఇష్టమని అందుకే ఆయనకు డై హార్డ్ ఫ్యాన్ గా మారానని, ఎవరైనా కష్టం అని వచ్చిందని చెప్పగానే అక్కడ పవర్ స్టార్ ఖచ్చితంగా ఉంటారు, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చని పల్లవి అన్నది. అలాగే, తెలుగు ఆడియెన్స్ కు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టం అని వారందరి అభిమానమే వలనే నేను ఈ రోజున స్టార్ గా ఉన్నానని తెలిపింది.

Next Story