వైట్ శారీ, అతని పాటలు అంటే నాకు చాలా ఇష్టం.. రవితేజ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయాతి(Dimple Hayarthi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

వైట్ శారీ, అతని పాటలు అంటే నాకు చాలా ఇష్టం.. రవితేజ బ్యూటీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ డింపుల్ హయాతి(Dimple Hayarthi) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఈ భామ మన తెలుగు అమ్మాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ‘గల్ఫ్’(Galf) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత ‘యురేక’(Yureka), ‘అభినేత్రి’(Abhinetri), ‘గద్దలకొండ గణేష్’(Gaddalakonda Ganesh)(ఐటెం సాంగ్), ‘సామాన్యుడు’(samanyudu), ‘ఖిలాడి’(Khiladi), ‘రామబాణం’(Ramabanam) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

కానీ ఈ బ్యూటీకి అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నప్పటికీ లక్ కలిసి రావట్లేదు. మరి ఏమైందో ఏమో కానీ గోపీచంద్(Gopichand) సరసన ‘రామబాణం’ మూవీలో చివరి సారిగా నటించిన ఈ అమ్మడు.. తర్వాత మరో సినిమా ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియా(Social Media))లో మాత్రం నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందును వడ్డిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

తాజాగా డింపుల్ హయాతి తన ఇన్‌స్టా గ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ వాలు కళ్ళతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తోంది. ఇక ఈ ఫొటోస్ షేర్ చేస్తూ.. ‘వైట్ శారీ ఇళయరాజా(Ilaya Raja) సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. లుకింగ్ బ్యూటీ ఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ భామ ఫొటోలపై ఓ లుక్ వేసేయండి.

Next Story