- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ ‘కూలీ’ క్రేజ్ మామూలుగా లేదుగా.. సెలవు ప్రకటించిన సాఫ్ట్‌వేర్ కంపెనీ
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie).

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanakaraj) దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’(coolie). నాగార్జున(Nagarjuna) కీ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్(Sruthi Haasan), పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే దీనిని సన్ పిక్చర్స్(Sun Pictures) భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్(Anirudh) సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
దీంతో ఫస్ట్ డేనే తమ ఉద్యోగులు రజనీ సినిమా చూసేందుకు యూనో ఆక్వాకేర్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ సెలవు ప్రకటించినది. చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై, చెంగల్పట్టు, అరపాలయం, మట్టుతనివానిల్లో ఉన్న అన్ని బ్రాంచిలకు సెలవు వర్తిస్తుందని సర్క్యూలర్ పంపింది. తమ ఉద్యోగుల వినతి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు కూలీ క్రేజ్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






