వామ్మో వాయ్యో సాంగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ మూవీ గుర్తుకు వచ్చింది.. డింపుల్ హయాతీ

by I. Sairam |

‘గద్దల కొండ గణేష్’(Gaddalakonda Ganesh) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతీ(Dimple Hayathi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

వామ్మో వాయ్యో సాంగ్ చేస్తున్నప్పుడు నాకు ఆ మూవీ గుర్తుకు వచ్చింది.. డింపుల్ హయాతీ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘గద్దల కొండ గణేష్’(Gaddalakonda Ganesh) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతీ(Dimple Hayathi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాలో నటిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మాస్ మహారాజా రవితేజ(Raviteja) హీరోగా నటిస్తున్నాడు. ఇక కిషోర్ తిరుమల(Kishore Tirumala) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) నిర్మిస్తున్నారు. అయితే ఇందులో డింపుల్ హయాతీతో పాటు ఆషిక రంగనాథ్(Ashika Ranganath) కూడా నటిస్తున్నది.

అయితే ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయాతీ మాట్లాడుతూ.. ‘వామ్మో వాయ్యో సాంగ్ చేస్తున్నప్పుడు నాకు గద్దలకొండ గణేష్ మూవీ గుర్తుకొచ్చింది. ఆ సినిమా లోని అబ్బచ్చా సాంగ్ ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఈ సాంగ్ నాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వామ్మో వాయ్యో పాటకే ఆడియన్స్ నుంచి అంత లవ్ వచ్చింది’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story