- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌లో హయ్యెస్ట్ నంది అవార్డులు గెలుచుకున్న హీరో.. అస్సలు ఊహించి ఉండరేమో!
1964లో తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇవ్వడం మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: నంది అవార్డ్స్.. ఆల్ మోస్ట్ 9 ఇయర్స్ తర్వాత మళఅలీ ఈ అంశం తెరపైకి వచ్చింది. చివరిగా 2017లో మూడు సంవత్సరాలకు సంబంధించి నంది అవార్డులను అందజేసింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అసలు ఈ ప్రస్తావనే తీసుకురాలేదు. మళ్లీ ఇన్నేళ్లకు కూటమి ప్రభుత్వం నంది అవార్డులు అందించేందుకు సన్నాహాలు చేపట్టింది. ఈ క్రమంలో నంది అవార్డులపై చర్చ మొదలైంది. అసలు విషయానికొస్తే.. 1964లో తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇవ్వడం మొదలైంది. అప్పటి నుంచి 2016 వరకూ విడుదలైన చిత్రాలకు, వాటిలో నటించిన నటీనటులకు నంది అవార్డులు అందించారు. అయితే ఉత్తమ నటుడిగా టాలీవుడ్ లో ఏ హీరో అత్యధిక నంది అవార్డులు అందుకున్నాడో తెలిస్తే కచ్చితంగా షాకవుతారు. ఆ హీరోకి అన్నేసి నంది అవార్డులు వచ్చి ఉంటాయని ఊహించి ఉండరు కూడా.
టాలీవుడ్ లో మొత్తం 20 మంది హీరోలకు నంది అవార్డులు రాగా.. అత్యధిక సార్లు విక్టరీ వెంకటేష్ ఈ అవార్డును అందుకున్నారు. ఏకంగా ఐదుసార్లు నంది అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. ఆ తర్వాతి స్థానంలో నాలుగు నందులతో మహేశ్ బాబు ఉండగా.. కమల్ హాసన్, జగపతి బాబు, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణలు మూడేసి సార్లు నంది అవార్డులు అందుకున్నారు. చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణంరాజు, ప్రభాకర రెడ్డి, రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావులకు రెండేసి సార్లు నంది అవార్డులు దక్కాయి. హేమ సుందర్, గోకిన రామారావు, సుమన్, మురళీమోహన్, రవతేజ, నేచురల్ స్టార్ నాని, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నంది అవార్డు అందుకున్నారు. వీరిలో సుమన్ - జగపతిబాబుకి 1993లో సంయుక్త నంది అవార్డు వచ్చింది.
ఈ సినిమాల్లో నటనకు నంది
వెంకటేశ్ తొలిసారి 1988లో ప్రేమ సినిమాలో ఉత్తమ నటనకు నంది అవార్డు అందుకున్నారు. 1995లో ధర్మచక్రం, 1998లో గణేష్, 1999లో కలిసుందాం రా, 2007లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలకు నందులు అందుకున్నారు. మహేశ్ విషయానికొస్తే.. నిజం (2003), అతడు (2005), దూకుడు (2011), శ్రీమంతుడు (2015) సినిమాల్లో ఉత్తమ నటుడిగా అవార్డులు తీసుకున్నారు. కమల్ హాసన్ కు ఏ సినిమాల్లో నంది అవార్డులు వచ్చాయో ఈజీగా చెప్పేయొచ్చు. సాగర సంగమం (1983), స్వాతిముత్యం (1986), ఇంద్రుడు చంద్రుడు (1989) సినిమాల్లో నంది అవార్డులు అందుకున్నారు.
హీరోయిన్లలో జయసుధకే..
హీరోయిన్ల విషయానికొస్తే.. 30 మంది హీరోయిన్లు నంది అవార్డులు అందుకున్నారు. వారిలో జయసుధ ఐదుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. విజయశాంతి నాలుగుసార్లు, సౌందర్య మూడు సార్లు, లక్ష్మి, ఆమని, లయ రెండేసి నంది అవార్డులు అందుకున్నారు. జ్యోతి (1975), ఇది కథ కాదు (1979), ప్రేమాభిషేకం (1981), మేఘసందేశం (1982), ధర్మాత్ముడు (1983) సినిమాల్లో నటనకు జయసుధ ఐదుసార్లు ఉత్తమనటిగా అవార్డులు తీసుకున్నారు. ప్రతిఘటన (1985), భారతనారి (1989), కర్తవ్యం (1990), ఒసేయ్ రాములమ్మ (1997) సినిమాల్లో నటనకు విజయశాంతి 4సార్లు, అమ్మోరు (1994), పవిత్ర బంధం (1996), అంతఃపురం (1998) సినిమాల్లో నటనకు సౌందర్య మూడుసార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు.
జయప్రద, రూప, తెలంగాణ శకుంతల, సుహాసిని, సుమలత, భానుప్రియ, శ్రీదేవి, మీనా, మహేశ్వరి, కల్యాణి, భూమిక చావ్లా, కమలినీ ముఖర్జీ, త్రిష, నందితా దాస్, ఛార్మి కౌర్, స్వాతి రెడ్డి, తీర్థ, నిత్యా మీనన్, నయనతార, సమంత రూత్ ప్రభు, అంజలి పాటిల్, అంజలి, అనుష్క శెట్టి, రీతు వర్మ ఒక్కసారి నంది అవార్డు అందుకున్నారు.






