నేల ఉన్నచోట బతుకు.. సంప్రదాయం ఉన్నచోట బలం ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‌గా సంబరాల ఏటిగట్టు పోస్టర్

by I. Sairam |

సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu).

నేల ఉన్నచోట బతుకు.. సంప్రదాయం ఉన్నచోట బలం ఉంటుంది.. ఇంట్రెస్టింగ్‌గా సంబరాల ఏటిగట్టు పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సాయి ధరమ్ తేజ్‌(Sai Dharam Tej) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’(Sambarala Yeti Gattu). రోహిత్‌ కేపీ(Rohith KP) దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lakshmi), జగపతిబాబు(Jagapathi babu), సాయికుమార్‌(Sai Kumar), శ్రీకాంత్‌(Srikanth), అనన్య నాగళ్ల(ananya Nagalla) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బి.అజనీష్‌ లోక్‌నాథ్‌(Ajaneesh Loknath) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ మిథికల్‌ యాక్షన్‌ థీమ్‌తో మెప్పించింది.

అయితే నేడు సంక్రాంతి కానుకగా ఈ మూవీ నుంచి హీరోకు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఆ ఫొటోను హీరో సాయి ధరమ్ షేర్ చేస్తూ.. ‘నేల ఉన్నచోట బతుకు ఉంటుంది. సంప్రదాయం ఉన్నచోట బలం ఉంటుంది. “బలి” మరియు “సంబరాల ఏటిగట్టు” నుండి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. 2026లో సంబరాల ఏటిగట్టు మూవీ రిలీజ్ కానుంది.. అందరికీ హ్యాపీ సంక్రాంతి’ అని రాసుకొచ్చాడు. ఇక పోస్టర్‌లో సాయి ధరమ్ తేజ్ ఓ ఆవును పట్టుకుని పక్కకు చూస్తూ నవ్వుతున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌కు సంబంధించిన లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Next Story