- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎప్పుడైతే తలుపులు తెరుస్తామో అప్పుడు నిజం బయటపడుతుంది.. లాక్ డౌన్ నుంచి వైల్డ్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’(Lockdown).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameshwaran) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘లాక్‌డౌన్’(Lockdown). ఏఆర్ జీవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. అయితే ఈ సినిమాలో అనుపమ ‘అనిత’ అనే మధ్యతరగతి యువతిగా కనిపించబోతుంది. ఇక కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో సాధారణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ముఖ్యంగా ఒక యువతి ఒంటరిగా ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను నిజమైన వాస్తవ కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది.
అయితే ఈ మూవీ జనవరి 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఈ చిత్రం నుంచి రేపు సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నదనే విషయాన్ని తెలుపుతూ ఓ వైల్డ్ పోస్టర్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా.. ‘ఎప్పుడైతే తలుపులు తెరుస్తామో అప్పుడు నిజం బయటపడుతుంది’ అని రాసుకొచ్చింది. ఇక పోస్టర్‌లో అనుపమతో పాటు చాలా మంది నటులు బాధపడుతూ, ఏడుస్తూ కనిపించారు.






