ఆ మాట విన్నాక గుండెల్లో గునపంతో పొడిచినట్లైంది, బాధని మాటల్లో చెప్పలేను.. స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel).

ఆ మాట విన్నాక గుండెల్లో గునపంతో పొడిచినట్లైంది, బాధని మాటల్లో చెప్పలేను.. స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన తాజా సినిమా ‘తండేల్’(Thandel). చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని చిత్రంపై భారీ అంచనాలు పెంచగా.. సాంగ్స్ మాత్రం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలా విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఫస్ట్ షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది.

ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్‌కి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు ఆడియన్స్. అలాగే దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) తన మ్యూజిక్‌తో అదరగొట్టేశాడు. అంతే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా ఇంతటి విజయం సాధించడంతో ప్రస్తుతం మూవీ టీమ్ సక్సెస్ మీట్ అంటూ పలు ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన డైరెక్టర్ చందూ మొండేటి ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “హీరో నాగచైతన్యతో మూడు సినిమాల ప్రయాణం నాది. ఆయనతో అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది.

మా కాంబోలో సినిమా రూ.100 కోట్లు వసూళ్లకి చేరువ కావడం, అంతకుమించిన గౌరవాన్ని మాకు తెచ్చిపెట్టడం ఎంతో తృప్తినిచ్చింది. ఇది మా అందరి కృషి. కథలో తండేల్ నాగచైతన్య అయితే, ఈ సినిమాకి తండేల్ నిర్మాత అల్లు అరవింద్. ఆయన, బన్నీ వాసు, దేవి శ్రీ ప్రసాద్, శ్యామ్ దత్ తదితర సాంకేతిక నిపుణులతో పాటు, నటులు కలిసి చేసిన శ్రమ ఫలితమే ఈ విజయం. ఇందులో ప్రేమకథ ఎలా ఉండాలి..? పాకిస్తాన్ ఎపిసోడ్ ఎలా ఉండాలనే విషయంలో నాకు స్టార్టింగ్ నుంచి సృష్టత ఉంది. కొంతమంది నుంచి జైల్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపించాయి.

ఇందులో ఏది ఎవరికి నచ్చుతుందో నేను ఊహించా. కొన్ని సింగిల్ థియేటర్లలో సినిమాని చూసినప్పుడు ఆ సన్నివేశాల్ని చాలా ఆస్వాదించడం కనిపించింది. థియేట్రికల్ అనుభవం కోసం ఎంతో కష్టపడి మూవీను తీస్తే, కొంతమంది పైరసీ చేశారు. ఇలాంటివి థియేటర్లలో చూస్తే ఆ ఫీలింగ్ వేరు. పైరసీ మాట విన్నాక గుండెల్లో గునపంతో పొడిచినట్లైంది, ఆ బాధని మాటల్లో చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చందూ మొండేటి చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story