- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ మూవీలో నటిస్తారా అని కాల్ వస్తే స్పామ్ కాల్ అనుకున్నాను.మాళవిక
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ప్రజెంట్ ‘రాజా సాబ్’(Raja Saab) మూవీలో నటిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) ప్రజెంట్ ‘రాజా సాబ్’(Raja Saab) మూవీలో నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్(Ridhi Kumar)లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.
దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మాళవిక వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘ప్రభాస్ సినిమాలో నటిస్తారా అని ఫోన్ వస్తే స్కామ్ కాల్ అనుకున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో హీరో విజయ్ దేవరకొండతో నాకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
అయితే అప్పటికే అతనితో నాకు మంచి స్నేహం ఉండడం, మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండడంతో సంతోషంగా ఆ మూవీ ఒప్పుకున్నాను. అయితే విజయ్ ఆ సినిమా బదులు లైగర్ చేయాలని అనుకోవడంతో కొంత షూటింగ తర్వాత ఆ సినిమా ఆగింది. అలా నా తెలుగు డెబ్యూ అప్పుడు మిస్సయింది. తర్వాత సలార్ సినిమాకు నాతో టీం సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే.. కానీ అగ్రిమెంట్ లాంటిదేమీ జరగలేదు.. డేట్లు సర్దుబాటు కాకపోవడం, వేరే ఇబ్బందుల వల్ల నేను ఆ సినిమా చేయలేకపోయాను. ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత రాజా సాబ్ మూవీ కోసం కాల్ వచ్చింది. అందుకే నేను స్కామ్ కాల్ అనుకున్నాను. కానీ రాజాసాబ్ లాంటి మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Read More..
అప్పటి వరకు అబ్బాయిల జోలికి వెళ్లను.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్






