- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పటి వరకు అబ్బాయిల జోలికి వెళ్లను.. శ్రీలీల షాకింగ్ కామెంట్స్
‘పెళ్లి సందడి’(Pelli Sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం శివ కార్తికేయన్(Sivakarthikeyan) సరసన ‘పరాశక్తి’(Parasakthi) మూవీలో నటిస్తోంది. సుధా కొంగర(Sudha Kongara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రవి మోహన్(Ravi Mohan), అథర్వ మురళి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.
ఈ క్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన శ్రీలీల వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి వ్యక్తిగత విషయాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిన్నది తన పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ప్రస్తుతం 24 సంవత్సరాలే. నాకు 30 ఏళ్లు దాటేవరకూ పెళ్లి చేసుకోను. కాబట్టి ఇప్పుడే అబ్బాయిల జోలికి వెళ్లదలుచుకోలేదు.
ప్రజెంట్ నేను లవ్‌లో ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. నేను ఎక్కడికెళ్లినా మా అమ్మ నా వెంట వస్తుంది. అలాంటప్పుడు నేనెలా ప్రేమలో పడగలను. యూఎస్ వెళ్లినప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. అయినా నాపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..






