- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్లు గ్లామర్‌గా ఉంటే తప్పేంటీ? ట్రోలర్స్‌కు రకుల్ స్ట్రాంగ్ కౌంటర్
గ్లామర్ వల్ల సినిమాకు అందం వస్తుందే తప్ప దానివల్ల నష్టం లేదని ఆమె వివరించారు. గ్లామర్ పట్ల సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని అందరూ మార్చుకోవాలని రకుల్ కోరారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ పెళ్లైనప్పటికీ ఏ మాత్రం నటనకు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్‌సింగ్ గ్లామర్, హీరోయిన్ల కెరీర్‌పై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై రకరకాల చర్చలు జరుగుతుంటాయి. అంతేకాకుండా కొందరు విమర్శలు కూడా చేస్తుంటారు.. ఇక ఈ విషయంపై రకుల్ స్పందిస్తూ, హీరోయిన్లు సినిమాల్లో అందంగా, గ్లామర్‌గా కనిపించడంలో ఎలాంటి తప్పు లేదని తేల్చి చెప్పారు. గ్లామర్ అనేది సినిమా రంగానికి ఎంతో అవసరమని రకుల్ అభిప్రాయపడ్డారు. ఆకర్షణ అనేది కేవలం ఒక లుక్ మాత్రమే కాదని, అది కూడా నటనలో ఒక భాగమేనని ఆమె స్పష్టం చేశారు.
అయితే, ఈ ఆకర్షణ అనేది హద్దులు దాటనంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, పరిమితుల్లో ఉండే గ్లామర్ వల్ల సినిమాకు అందం వస్తుందే తప్ప దానివల్ల నష్టం లేదని ఆమె వివరించారు. గ్లామర్ పట్ల సమాజంలో ఉన్న తప్పుడు అభిప్రాయాన్ని అందరూ మార్చుకోవాలని రకుల్ కోరారు. గ్లామర్ అంటే కేవలం బట్టలు లేదా అందాల ప్రదర్శన మాత్రమే కాదనే విషయాన్ని కొందరు అర్థం చేసుకోవాలని, దానిపై సరైన అవగాహన పెంచుకుంటే మంచిదని అన్నారు. ఈ రోజుల్లో కొంతమంది ప్రేక్షకులు కూడా అప్‌డేట్ అయ్యారని, సినిమాల్లో కథకు తగ్గట్టుగా హీరోయిన్లు గ్లామర్‌గా కనిపిస్తే ఆదరిస్తున్నారని రకుల్ పేర్కొన్నారు. అలాగే హీరోయిన్ల పెళ్లి, కెరీర్ గురించి వస్తున్న అపోహలపై కూడా రకుల్ మాట్లాడారు. ఇండస్ట్రీలో పెళ్లయ్యాక హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే పాత ఆలోచనలను ఆమె కొట్టిపారేశారు. నటీమణుల ప్రతిభకు, వారి నటనకు వివాహం అనేది ఎప్పటికీ అడ్డంకి కాదని రకుల్ చాలా స్పష్టంగా చెప్పారు. పెళ్లయిన తర్వాత కూడా ఎంతోమంది హీరోయిన్లు అద్భుతమైన పాత్రలు చేస్తూ సక్సెస్ అవుతున్నారని గుర్తుచేశారు.






