- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసలు త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి.. ఆదర్శ కుటుంబంలోకి మూడో ముద్దుగుమ్మ?
‘ఆదర్శ కుటుంబం AK 47’ చిత్రంలో ఓ సీనియర్ హీరోయిన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటగా శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా ఖరారు చేశారు. దీంతో త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే నేపథ్యంలో, ఈసారి మాత్రం ఒకే హీరోయిన్‌తో సినిమా ఉండొచ్చని చాలామంది భావించారు. అయితే, కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో త్రివిక్రమ్ తన పాత ఫార్ములానే కొనసాగిస్తూ ఇద్దరు హీరోయిన్లతో సినిమాను రూపొందిస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు మాత్రమే ఉంటారని ప్రేక్షకులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఇలాంటి సమయంలో తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మరో సీనియర్ బ్యూటీ కూడా కనిపించబోతున్నట్లు, ఆమె పాత్ర కథలో కీలకంగా ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దీంతో ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రంలో ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు కనిపించనున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అసలు త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఈసారి కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడా? అనే చర్చలు సినీ వర్గాల్లో సాగుతున్నాయి. ఏదేమైనా వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండడంతో ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.






