- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొణిదెల అంజనమ్మకు అస్వస్థత.. అసలు ఏమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి(Magastar Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

దిశ,వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Magastar Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమెను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దుబాయ్‌లో తన భార్యతో కలిసి పెళ్లి రోజు వేడుకలలో నిమగ్నమై ఉన్నారు. చిరంజీవి, సురేఖల పెళ్లి రోజైన ఫిబ్రవరి 20న స్నేహితులతో కలిసి ఫ్లైట్ లో దుబాయ్ వెళుతున్నట్లుగా చిరంజీవి పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో తన తల్లి అంజనా దేవి ఆరోగ్యం బాగా లేదని తెలిసి వారు వెంటనే తిరుగు ప్రయాణమైనట్లుగా మెగా సన్నిహిత వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక అంజనా దేవి చిన్న కుమారుడు ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేసి విజయవాడ(Vojayawada) నుంచి హైదరబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తోంది. మరోవైపు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా తన ఆర్‌సి 16 సినిమా షూట్ నుంచి నేరుగా హస్పటల్‌కు వెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్తలపై తాజాగా చిరంజీవి టీమ్(Chiranjeevi Team) స్పందించింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురయ్యారు అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వివరించారు. కాగా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి మదర్ అంజనా దేవి పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.






