ఐబొమ్మ రవిని హీరోగా చూడటం ఏంటి.. నిర్మాత బన్నీ వాసు ఫైర్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-22 07:28:31  IST  )

ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి (Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత రెండు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఐబొమ్మ రవిని హీరోగా చూడటం ఏంటి.. నిర్మాత బన్నీ వాసు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి (Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత రెండు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ఆరు గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, అనూహ్యంగా సోషల్ మీడియాలో రవికి సాధారణ ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు వేలకు వేలు పెంచిన తరుణంలో ఐబొమ్మ రవి సామాన్యుడి చెంతకు కొత్త సినిమాలను తీసుకొచ్చాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అతనికి మద్దతుగా వేలాది నెటిజన్లు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రజలు ఐబొమ్మ రవికి మద్దతు ఇవ్వడంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఓ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఐబొమ్మ రవిని హీరోగా చూడటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అతనికి అంత ఎలివేషన్ ఇవ్వడం సరికాదని కామెంట్ చేశారు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని.. రవి సినీ ఇండస్ట్రీకి రూ. కోట్ల నష్టం తెచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడొద్దని నిర్మాత బన్నీ వాసు విజ్ఞప్తి చేశారు.

Read More..

iBOMMA రవి కేసులో కీలక మలుపు.. తెలంగాణ సీఐడీ ఎంట్రీ

సౌత్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఆ సినిమాలు కొనకూడదని నిర్ణయం

Next Story