సౌత్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఆ సినిమాలు కొనకూడదని నిర్ణయం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-22 11:08:47  IST  )

ఐబొమ్మ రవి అరెస్టుతో .. ప్రజలు ఓటీటీలవైపు నెమ్మదిగా దృష్టి పెడుతున్నారు.

సౌత్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఆ సినిమాలు కొనకూడదని నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ రవి అరెస్టుతో .. ప్రజలు ఓటీటీలవైపు నెమ్మదిగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి బిగ్ షాకిచ్చింది. తెలుగు, తమిళ నిర్మాతలకు ఇది ఊహించని షాక్. భారీ ధరలకు సినిమాలను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. వాటికి బదులుగా వెబ్ సిరీస్ లు, రియాల్టీ షోలు, ఒరిజినల్ కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించడంపై దృష్టి పెట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ లో స్పెషల్ గా ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసింది.

కరోనా కాలం నుంచి ఓటీటీలకు ప్రేక్షకాదరణ పెరిగింది. దానిని క్యాష్ చేసుకుంటున్న ఓటీటీలు.. థియేటర్లలో సినిమాలు విడుదలైన నెలరోజులకు, ఒక్కోసారి నెలరోజుల్లోగానే వాటిని ఆన్ లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఫలితంగా థియేటర్లలో సినిమా పెద్దగా ఆడకపోయినా ఓటీటీలు పెద్ద, చిన్న సినిమాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ తీసుకున్న నిర్ణయంతో అగ్రహీరోల సినిమాల నిర్మాతలకు గట్టిషాకే తగిలినట్లయింది. ఇకపై నిర్మాతలు బడ్జెట్ ను తగ్గించుకోవడమో లేదా.. హీరోలే రెమ్యునరేషన్ ను తగ్గించుకోవడమే చేయాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

READ MORE ....

ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల

Next Story