Tamannaah Bhatia : వెయిట్ లాస్ డ్రగ్స్ యూజ్ చేసిన తమన్నా?

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-29 10:05:00  IST  )

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా బిజీగా ఉండటం పక్కన పెడితే ఐటెమ్ సాంగ్స్‌తో బిజీ అయిపోయింది. కాస్త బోల్డ్‌గానే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎంత మంది ఎన్నిరకాలుగా కామెంట్ చేసిన తను మాత్రం మౌనంగానే ఉంది. కానీ

Tamannaah Bhatia : వెయిట్ లాస్ డ్రగ్స్ యూజ్ చేసిన తమన్నా?
X

దిశ, సినిమా : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా బిజీగా ఉండటం పక్కన పెడితే ఐటెమ్ సాంగ్స్‌తో బిజీ అయిపోయింది. కాస్త బోల్డ్‌గానే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎంత మంది ఎన్నిరకాలుగా కామెంట్ చేసిన తను మాత్రం మౌనంగానే ఉంది. కానీ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కారణం వెయిట్ లాస్ డ్రగ్స్ యూజ్ చేయడమేనన్న విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

‘నా బాడీ కర్వ్స్ నేచురల్. నాలో పార్ట్ అవి. నేను సింధి. హిప్, వెస్ట్ ఎక్కడికి పోవు. కారణం బోన్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. కొవిడ్ తర్వాత బాడీ చేంజ్ అయింది. అంతేకాదు స్త్రీలలో ఏజ్, హార్మోన్స్ కారణంగా శరీరంలో మార్పులు వస్తాయి. నేను వెస్టర్న్ బ్యూటీ స్టాండర్స్‌ను ఫాలో కాను. ఇండియన్‌గా ఉండటమే అందం. జనాలు మన కర్వ్స్ లవ్ చేస్తారు. ఇతరులను చూసి పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచనలో పడిపోకుండా ఉండటమే బెస్ట్’ అని చెప్పింది తమన్నా.

Next Story