Suhas: రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ నుంచి.. బ్యూటీఫుల్ పెళ్లి సాంగ్ రిలీజ్

by Chukka Sudharani |

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ (Suhas) నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’

Suhas: రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ నుంచి.. బ్యూటీఫుల్ పెళ్లి సాంగ్ రిలీజ్
X

దిశ, సినిమా: సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో సుహాస్ (Suhas) నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ (Romantic comedy) ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama). ఇందులో మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్ (Malavika Manoj) (జో ఫేమ్) హీరోయిన్‌గా తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. రామ్ గోధల (Ram Godhala) దర్శకత్వంలో వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో నుంచి ‘రామచంద్రుడే’ అంటూ సాగే ఓ బ్యూటిఫుల్‌ పెళ్లి సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఈ పెళ్లి పాట తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో వచ్చిన ఉత్తమమైన పెళ్లి పాటల్లో తప్పకుండా మా రామచంద్రుడే సాంగ్‌ కూడా ముందు వరుసలో ఉంటుంది. రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఈ పెళ్లి పాట అందరికి ఎంతగానో నచ్చుతుంది’ అన్నారు. కాగా.. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు.

Next Story