- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అనగనగా ఒక రాజు’ నుంచి వెడ్డింగ్ సాంగ్ వచ్చేస్తుందోచ్.. వీడియో వైరల్
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju).

దిశ, వెబ్‌డెస్క్: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju). ఈ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కో ప్రొడ్యూస్ చేస్తుంది.
మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. సంక్రాంతి కానుకగా.. జనవరి 14 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతుంది.
ఈ క్రమంలో ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ ‘రాజు గారి పెళ్లిరో’ సాంగ్ ఈ ప్రోమో ఈరోజు రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘అందరి దృష్టి డ్యాన్స్ ఫ్లోర్ పైనే ఉంది.. సంవత్సరం పెళ్లి పాట #రాజుగారిపెళ్లిరో ఈరోజు విడుదల కానుంది.. జనవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది’ అని రాసుకొచ్చారు. అలాగే ఓ వీడియో క్లిప్‌ను యాడ్ చేశారు. ఇక పోస్టర్‌లో హీరో హీరోయిన్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






