అక్కినేని ఇంట పెళ్లి సందడి స్టార్ట్.. బరాత్‌లో డ్యాన్స్ చేసిన అఖిల్(వీడియో)

by Gugulothu.Kavitha |

అక్కినేని ఇంట మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి.

అక్కినేని ఇంట పెళ్లి సందడి స్టార్ట్.. బరాత్‌లో డ్యాన్స్ చేసిన అఖిల్(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని ఇంట మ‌రోసారి పెళ్లిబాజాలు మోగ‌నున్నాయి. గ‌తేడాది నాగార్జున(Nagarjuna) పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య(Naga Chaitanya)-శోభితా(Shobhitha) వివాహ‌ బంధంలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న‌ చిన్న కొడుకు అఖిల్(Akhil) కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవడ్జీ కుమార్తె జైనబ్‌(Jainab)తో గతేడాది నవంబర్ 26న అఖిల్ నిశ్చితార్థం జ‌రిగింది.

ఇక జూన్ 6న అఖిల్‌- జైనబ్‌ల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా జరగనుంది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అక్కినేని ఇంట్లో అప్పుడే పెళ్లి సందడి స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. బరాత్‌(Baraatha)లో భాగంగా అక్కినేని అఖిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. కాగా అన్న‌పూర్ణ స్టూడియోలో వివాహం త‌ర్వాత రాజ‌స్థాన్‌లో ఈ జంటకు రిసెప్ష‌న్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

For Link Click Here:

Next Story