- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుపై వెబ్ సిరీస్.. ఉత్కంఠరేపుతున్న ట్రైలర్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Former Prime Minister Rajiv Gandhi) హత్య కేసును ఆధారం డైరెక్టర్ నగేశ్ కుకునూర్ ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Former Prime Minister Rajiv Gandhi) హత్య కేసును ఆధారం డైరెక్టర్ నగేశ్ కుకునూర్ ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. 'ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case)' పేరుతో రూపొందించిన ఈ సిరీస్ జులై 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ (Sony Liv)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సుమారు 35 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు సాగిన తీరు, 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్న దానిని ప్రధానంగా చూపించారు. ఇక కొలంబోలోని భారత రాయబార కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా?' అని ప్రశ్నించే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కొన్ని చూపించారు. ఇక ఈ సిరీస్‌లో అమిత్ సియాల్, సాహిల్ వైద్, భగవతీ పెరుమాళ్ తదితరులు నటించారు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు.






