‘జననాయగన్’ రిలీజ్ డేట్‌ను త్వరలోనే అఫీషియల్‌గా చెప్తాం.. విజయ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ప్రియమణి!

by Mallepaka Hamsa |

జననాయగన్’ సినిమా ఈ నెలలో వస్తుందా లేక వచ్చే నెలలో విడుదలవుతుందా అనే విషయాన్ని మేం చాలా త్వరగా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం.

‘జననాయగన్’ రిలీజ్ డేట్‌ను త్వరలోనే అఫీషియల్‌గా చెప్తాం.. విజయ్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన  ప్రియమణి!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఇప్పటివరకు విడుదల కాలేదు. నిజానికి ఈ ఏడాది జనవరి 9నే థియేటర్లలోకి రావాల్సి ఉన్నా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ , నిర్మాతల మధ్య వచ్చిన కొన్ని గొడవలు, సమస్యల వల్ల రిలీజ్ ఆగిపోయింది. మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్స్ ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం చిత్ర యూనిట్‌ను కలవరపెట్టింది. అయితే మూవీ మేకర్స్ వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవడంతో లీకేజీల సమస్య సర్దుమణిగింది. తాజాగా ఈ సినిమా అన్ని ఇబ్బందులను దాటుకుని సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ ఇచ్చిందని, ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతుందని టాక్. ఈ నేపథ్యంలో, సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి ప్రియమణి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా రిలీజ్, విజయ్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "‘జననాయగన్’ సినిమా ఈ నెలలో వస్తుందా లేక వచ్చే నెలలో విడుదలవుతుందా అనే విషయాన్ని మేం చాలా త్వరగా అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తాం. అలాగే విజయ్ గారు ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. అందరూ అనుకుంటున్నట్లే ఆయన ఈ లీడర్ బాధ్యత కోసమే పుట్టారని నేను బలంగా నమ్ముతున్నాను. సీఎం పదవిలో ఆయన చాలా అద్భుతంగా పని చేస్తున్నారు. ఆయన ఇదే దారిలో ముందుకు సాగాలని కోరుకుంటూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రియమణి చెప్పుకొచ్చారు. ప్రియమణి ఇచ్చిన క్రేజీ అప్డేట్‌లో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story