నిందితులకు కఠిన శిక్ష పడేవరకు మేం అస్సలు ఊరుకోం.. మైకీ హత్యపై మంజరీ న్యాయ పోరాటం

by Mallepaka Hamsa |

మైకీ.. నువ్వు చనిపోయావనే నిజాన్ని మేం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు నుండి మా సొసైటీలో ఉన్నవారెవ్వరూ ప్రశాంతంగా నిద్రపోలేదు.

నిందితులకు కఠిన శిక్ష పడేవరకు మేం అస్సలు ఊరుకోం.. మైకీ హత్యపై మంజరీ న్యాయ పోరాటం
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి మంజరీ ఫడ్నీస్ ఇటీవల తనకెంతో ఇష్టమైన కుక్కపిల్ల చనిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని రాహెజా ఎక్సోటికా సొసైటీలె నివసించే మైకీ అనే కమ్యూనిటీ డాగ్‌ను కొందరు దుండగులు అత్యంత క్రూరంగా కొట్టి చంపారంటూ ఆరోపణలు చేశారు. తాజాగా, ఈ దారుణ ఘటనపై బాలీవుడ్ నటి మంజరీ ఫడ్నీస్ మైకీకి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది "మైకీ.. నువ్వు చనిపోయావనే నిజాన్ని మేం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆ రోజు నుండి మా సొసైటీలో ఉన్నవారెవ్వరూ ప్రశాంతంగా నిద్రపోలేదు. నిన్ను అంత దారుణంగా చంపిన వారిపై బలమైన ఆధారాలు సేకరించడానికి ఇక్కడ ఒక పెద్ద సైన్యమే రాత్రింబగళ్లు కష్టపడుతోంది. పోలీసుల దర్యాప్తుకు మా వంతు సహాయం అందిస్తున్నాం. నిందితులకు కఠిన శిక్ష పడేవరకు మేం అస్సలు ఊరుకోం, నీ మరణం వృథాగా పోనివ్వం" అని మంజరి ప్రామిస్ చేశారు.

ఈ పోస్ట్‌లో ఆమె నిందితుల క్రూరమైన ఆలోచనా విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మైకీ కేవలం ఒక సొసైటీ కుక్క మాత్రమేనని, అది కనిపించకుండా పోయినా లేదా చనిపోయినా ఎవరూ పట్టించుకోరని ఆ దుర్మార్గులు భావించారని ఆమె మండిపడ్డారు. కానీ, ఆ సొసైటీయే మైకీ ఇల్లనే విషయాన్ని, దానికంటూ అక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయనే నిజాన్ని వారు మర్చిపోయారని అన్నారు. "మేమంతా నిన్ను ఎంతో ప్రేమించాం మైకీ. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో.. దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని మేం బయటకు తీస్తాం. అలాగే ఇక్కడున్న నీ మిగతా మూగ స్నేహితులందరినీ మేం కంటికి రెప్పలా కాపాడుకుంటాం" అంటూ మంజరి రాసుకొచ్చారు. అంతేకాకుండా సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్రకు ధన్యవాదాలు తెలియజేశారు. తన సహకారం లేకుండా ఈ కేసు ఇంత వేగంగా ముందుకు సాగడం అసాధ్యమని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కొందరు నెటిజన్లు మంజరీకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Next Story