సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇస్తూనే ఉంటాం: విక్టరీ వెంకటేష్

by I. Sairam |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నయనతార(Nayanatara) జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇస్తూనే ఉంటాం: విక్టరీ వెంకటేష్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నయనతార(Nayanatara) జంటగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Varaprasad Garu) మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక దీనికి అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించగా.. విక్టరీ వెంకటేష్(Venkatesh) కీలక పాత్రలో అలరించారు. అలాగే షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఇప్పటికీ ఈ సినిమా మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకులు కె రాఘవేంద్రరావు, వివి వినాయక్, నిర్మాత దిల్ రాజు, సుప్రియ యార్లగడ్డ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక అక్కడ విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ‘అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ థాంక్యూ. మీ అందరి ఆదరణతో ఈ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అయింది. అన్ని ఆల్‌టైమ్ రికార్డ్స్‌కి చిరంజీవి గారు అర్హులు. ఇంత అద్భుతమైన సినిమాలో భాగమవడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ అనిల్‌కి థాంక్యూ. ఆయన టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.

ఈ సినిమాకి పని చేసిన మిగతా టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాజులేషన్స్. మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన సుస్మిత, సాహుకి కంగ్రాట్స్. ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ని ప్రోత్సహిస్తారు. ఈసారి కూడా ఎంకరేజ్ చేసినందుకు చాలా థాంక్స్. ఇక్కడికి విచ్చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిక్యూటివ్స్ అందరికీ అభినందనలు. ఎప్పుడు సంక్రాంతికి వస్తూనే ఉంటాం ధనాధన్ ఇస్తూనే వుంటాం’ అని వెంకటేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story