మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నాం.. కానీ బ్రేక్ తీసుకుంటున్నా అంటూ బేబీ డైరెక్టర్‌కు బిగ్ షాకిచ్చిన హీరో (పోస్ట్)

by Mallepaka Hamsa |

బాలీవుడ్ హీరో బాబిల్ ఖాన్‌(Babil Khan)తో సాయి రాజేష్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు.

మ్యాజిక్ క్రియేట్ చేయాలనుకున్నాం.. కానీ బ్రేక్ తీసుకుంటున్నా అంటూ బేబీ డైరెక్టర్‌కు బిగ్ షాకిచ్చిన హీరో (పోస్ట్)
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో బాబిల్ ఖాన్‌(Babil Khan)తో సాయి రాజేష్ తెలుగులో సూపర్ హిట్ అయిన ‘బేబీ’ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు. తెలుగులో ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda), వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటించిన ఈ మూవీ ఘన విజయం సాధించడంతో హిందీలోనూ తీసుకురావాలని మేకర్స్ అనుకున్నారు. అయితే అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ వీరిద్దరి షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈక్రమంలో.. తాజాగా, బాబిల్ ఖాన్ తప్పుకుంటున్నట్లు కొద్దికాలం పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ‘‘సాయి రాజేష్‌తో కలిసి మ్యాజిక్ క్రియేట్ చేయాలని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తూ అది సాధ్యపడడంలేదు.

ప్రస్తుతం నేను బ్రేక్ తీసుకుంటున్నాను. సాయి రాజేష్(Sai Rajesh), చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా మధ్య అపారమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. భవిష్యుత్తులో త్వరలో కలుద్దాం. కలిసి మాయాజాలాన్ని సృష్టిస్తాము’’ అని రాసుకొచ్చాడు. ఇక దీనిపై స్పందించిన సాయి రాజేష్ కూడా ఓ పోస్ట్ పెట్టాడు. ‘‘ నేను కలిసిన ప్రతిభావంతులైన, బాగా కష్టపడే నటుల్లో బాబిల్ ఖాన్ ఒకరు. కొంతకాలం ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను నా హీరోను మిస్ అవుతున్నా. అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నా. మేము తప్పకుండా మ్యాజిక్ క్రియేట్ చేస్తాం’’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా, ఇటీవల బాబిల్ ఖాన్ ఇండస్ట్రీలోని కొంతమంది గురించి చెప్తూ ఏడుస్తున్న వీడియోను షేర్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా కొంతమంది పేర్లను రివీల్ చేసి వారు మాత్రమే మంచివారని అనడంతో వివాదం మొదలైంది. ఇక ఈ విషయంపై సాయి రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇందుకు అనుగుణంగా బాబిల్ ఖాన్ కూడా తనను రెండేళ్లపాటు కష్టపెట్టి సినిమా చేయకుండా మోసం చేశాడంటూ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ వివాదం కారణంగానే ఇప్పుడు బాబిల్ ఖాన్ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story