పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ‘మహానటి’(Mahanati), ‘దసరా’(Dasara) సినిమాలతో ఈ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ మూవీలో నటిస్తోంది. ఇక కీర్తి సురేష్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తట్టిల్‌‌(Antony Thattil)ని ప్రేమించి ఏడాది క్రితం డిసెంబర్ 12న వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వేకేషన్స్‌కు తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ.. ‘మేము 15 ఏళ్లు ప్రేమలో ఉన్నాం.. అయితే మా పెళ్లి అలా వైభవంగా జరుగుతుంది అనుకోలేదు. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోక పోతే మేము పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ వాళ్ళు అంగీకరించడంతో మా మ్యారేజ్ గ్రాండ్‌గా జరిగింది. కల నిజం అయినట్లు అనిపించింది. అందుకే మా వివాహ వేడుకలో ఎమోషనల్ అయ్యాను. ఆంటోని కూడా నమ్మలేకపోయాడు. అందుకే అతను కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆంటోని కళ్లలో నీళ్లు చూశాను ఇది ఒక అందమైన ప్రయాణం’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story