ఎదుటివారి కంటే మనమే ఎక్కువ నరకం అనుభవిస్తాం.. విడాకుల తర్వాత మౌనీరాయ్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మనల్ని బాధపెట్టిన కోపాన్ని మనసులోనే పెట్టుకుంటే.. ఎదుటివారి కంటే మనమే ఎక్కువ నరకం అనుభవిస్తామని, అందుకే దాన్ని వదిలేయడమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు.

ఎదుటివారి కంటే మనమే ఎక్కువ నరకం అనుభవిస్తాం.. విడాకుల తర్వాత మౌనీరాయ్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీరాయ్ ఇటీవల తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోయిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా నాలుగేళ్లకే భర్తకు విడాకులు ఇచ్చారు. ఆమె స్వలింగ్ సంపర్కురాలంటూ ట్రోల్స్ వచ్చినప్పటికీ వాటిని ఖండిస్తూ.. ఇక ఆ బాధ నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మౌనీరాయ్ జీవితంలో ఎదురైన కష్టాల నుండి, బాధల నుండి బయటపడటానికి భక్తి, ఆధ్యాత్మికత తనకు ఎలా ఉపయోగపడ్డాయో వివరించారు. చిన్న వయసులో కూడా ఇతరులను క్షమించడం తనకు కష్టంగా అనిపించేది కాదని, కానీ ఆ తర్వాత మిగిలిపోయే బాధను మర్చిపోవడమే అసలైన సవాలుగా ఉండేదని ఆమె చెప్పారు. ఇప్పుడు తన జీవితంలో జరిగిన విషయాలు, భక్తి మార్గం వల్ల తనకు ఒక విషయం అర్థమైందని.. మనం ఎదుటివారిని మనస్ఫూర్తిగా క్షమిస్తే చాలు, ఆ బాధను పూర్తిగా మర్చిపోయేలా దేవుడే చూసుకుంటాడని మౌనీ రాయ్ తెలిపారు.

మనల్ని బాధపెట్టిన కోపాన్ని మనసులోనే పెట్టుకుంటే.. ఎదుటివారి కంటే మనమే ఎక్కువ నరకం అనుభవిస్తామని, అందుకే దాన్ని వదిలేయడమే మంచిదని ఆమె చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు మనల్ని అంతలా బాధపెట్టిన అవతలి వ్యక్తి.. అసలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా హ్యాపీగా ముందుకు సాగిపోతుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, క్షమించడం అంటే వాళ్లు చేసిన తప్పులను ఒప్పుకోవడం కాదని మౌనీ స్పష్టం చేశారు. ప్రపంచంలో కొందరు కావాలనే ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు అని.. తాను ఆ మనుషులను చెడ్డవాళ్లు అనడం లేదు కానీ, వాళ్లలో ఉండే ఆ చెడు బుద్ధిని మాత్రం కచ్చితంగా తప్పుపడతానని ఆమె అన్నారు. తనకు ప్రతిరోజూ మెడిటేషన్ చేసుకోవడం వల్లే మనశ్శాంతి దొరుకుతోందని తెలిపారు.

Next Story