Rakul Preet Singh: అలా చేయడం నటీనటుల బాధ్యత.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-05-20 15:02:54  IST  )

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రుకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

Rakul Preet Singh: అలా చేయడం నటీనటుల బాధ్యత.. రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రుకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. తమిళం, హిందీలో వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక రీసెంట్‌గా ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం ‘ఇండియన్-3’ (Indian-3), ‘దేదే ప్యార్ దే 2’ (Dede Pyaar De 2)తో పాటు తదితర చిత్రాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్.. పలు ఇంటర్వ్యూస్‌లో కూడా పాల్గొంటూ వ్యక్తిగత అంశాలతో పాటు సినిమా విశేషాలు కూడా పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ సినీ జర్నీ (Cine Journey)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘నేను హీరోయిన్ అవ్వాలనే ఆశతోనే సినీ ఇండస్ట్రీ(industry)లో అడుగు పెట్టాను. అయితే.. ఇండస్ట్రీలో కొంతకాలం వరకే అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించగలుగుతారు అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు ఆ పిరస్థితులు మారుతున్నాయి. మీరు అద్భుతంగా నటించగలిగినన్ని రోజులు వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణించే అవకాశం ఉంటుంది. అలాగే మన వర్క్‌లో మనం ఉత్తమంగా ఉండకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్లల్లో చిన్న పిల్లలు కూడా ఉంటారు. అందుకే కథలను ఎంపిక చేసుకునేటప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణాయాలు తీసుకోవాల్సిన బాధ్యత నటీనటులపై ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story