- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. థియేటర్ సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో ఏ సినిమా చూడాలో ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని పూజా హెగ్డే చెప్పారు. మూవీ చూస్తున్నప్పుడు అది మనసుకు హత్తుకుందా లేదా అనేది ప్రేక్షకులు చాలా త్వరగా కనిపెట్టేస్తున్నారని అన్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అమ్మడు లక్ కలిసి రావడం లేదు. బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు చేసినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఆశించినంత స్థాయిలో హిట్ అందుకోలేకపోతున్నాయి. అయినప్పటికీ పూజా క్రేజ్ మాత్రం తగ్గలేదు.. వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఐరన్ లెగ్ అంటూ తనపై ట్రోల్స్ వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. త్వరలో ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన అనుభవంపై ఆమె మాట్లాడుతూ.. "తెలుగు సినిమా నాకు పెద్ద స్కేల్, ఆడియన్స్ ఎనర్జీని నేర్పింది. తమిళ మూవీ కొన్ని సీన్లలో సైలెంట్‌గా ఎలా నటించాలో నేర్పింది. హిందీకి వేరే పద్ధతులు ఉంటాయి. నటిగా మనం మారకుండానే, అన్ని ఇండస్ట్రీల స్టైల్‌ను అలవాటు చేసుకోవాలి" అని చెప్పారు.
అలాగే, కమర్షియల్ సినిమాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా ఈజీగా అనిపించినా.. గ్లామర్, ఎమోషన్, కామెడీ, డ్యాన్స్, యాక్టింగ్.. ఇవన్నీ ఒకేసారి పర్ఫెక్ట్‌గా చేయడం నటీనటులకు చాలా కష్టమైన విషయమని గుర్తుచేశారు. ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, రీల్స్ వంటి షార్ట్ వీడియోలు ఎక్కువైపోవడంతో.. థియేటర్లలో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుండి పెద్ద పరీక్ష ఎదురవుతోందని పూజా హెగ్డే అన్నారు. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్లలో ఏ సినిమా చూడాలో ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని పూజా హెగ్డే చెప్పారు. మూవీ చూస్తున్నప్పుడు అది మనసుకు హత్తుకుందా లేదా అనేది ప్రేక్షకులు చాలా త్వరగా కనిపెట్టేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎవరినీ అబద్ధపు ఎంటర్టైన్‌మెంట్‌తో మోసం చేయలేమని పేర్కొన్నారు. ఎందుకంటే వాళ్లకు ఫోన్లలోనే సినిమాలు చూసేందుకు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయని స్పష్టం చేశారు. చివరగా, థియేటర్ల భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. "థియేటర్‌లో అందరితో కలిసి కూర్చుని సినిమా చూడటంలో ఒక వేరే మజా ఉంటుంది. అందరూ కలిసి నవ్వడం, చప్పట్లు కొట్టడం, డ్యాన్స్ చేయడం అనే అనుభూతిని ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో అస్సలు పొందలేము. అందుకే కమర్షియల్ సినిమాలకు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు" అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.






