అమావాస్య కారణంగా ఒక రోజు ముందే ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నాము.. నాగవంశీ ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-02 09:34:13  IST  )

నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin), విష్ణు ఓఐ(Vishnu OI) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్వేర్’(Mad Square).

అమావాస్య కారణంగా ఒక రోజు ముందే ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నాము.. నాగవంశీ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Sobhan), రామ్ నితిన్(Ram Nithin), విష్ణు ఓఐ(Vishnu OI) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మ్యాడ్ స్వేర్’(Mad Square). ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘మ్యాడ్‌’(Mad)కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ పై హారిక సూర్య దేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga vamsi) సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకొని సోషల్ మీడియా(social Media)లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాకుండా రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌(Teaser)తో కడుపుబ్బా నవ్వించేశారు. అయితే ఈ సినిమాలో ఇంతకంటే ఎక్కువ కామెడీ ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రం భారీ అంచనాల నడుమ మార్చ్ 29 రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీపోన్ అయినట్లు నిర్మాత నాగవంశీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ ట్వీట్ చేశాడు. ఇక నాగవంశీ తన ట్వీట్‌లో.. మా డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్‌తో, వాళ్ళ రిక్వెస్ట్‌తో మ్యాడ్ స్క్వేర్ సినిమా ఒక రోజు ముందే వస్తుంది. మార్చి 28నే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మార్చి 29 అమావాస్య రావడంతో, మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఒక రోజు ముందే అడగడంతో మేము హ్యాపీగా ఈ సినిమాని ఒక రోజు ముందే రిలీజ్ చేస్తున్నాం.

అలాగే మార్చి 28న మా మ్యాడ్ స్క్వేర్ సినిమా, నితిన్(Nithin) రాబిన్ హుడ్(Robin Hood) సినిమాలు రిలీజ్ అయి పెద్ద ఇట్ అయి తెలుగు సినిమాకు మర్చిపోలేని రోజుగా ఉండాలని కోరుకుంటున్నాను అని తెలుపుతూ నితిన్‌కి, రాబిన్ హుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల(Venky Kudumula)కు కూడా విషెష్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story