వాట్ నీలాంబరి క్యారెక్టర్‌‌‌కు ఫస్ట్ అనుకున్నది రమ్యకృష్ణను కాదా.. ఆ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

by I. Sairam |

సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajini Kanth) కెరీర్‌లో మలుపు తిప్పిన మూవీ ‘నరసింహ’(Narasimha).

వాట్ నీలాంబరి క్యారెక్టర్‌‌‌కు ఫస్ట్ అనుకున్నది రమ్యకృష్ణను కాదా.. ఆ లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజినీ కాంత్(Rajini Kanth) కెరీర్‌లో మలుపు తిప్పిన మూవీ ‘నరసింహ’(Narasimha). స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్(KS Ravikumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య(Soundarya), అబ్బాస్(Abbas), సితార(Sithara), నాజర్(Nazar), రాధా రవిలు నటించగా.. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్(Sivaji Ganesan) కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ మూవీ 1999 సంవత్సరంలో విడుదలై మంచి హిట్ సాధించింది. అంతేకాకుండా ఈ మూవీలో రమ్యకృష్ణ(Ramya Krishna) పోషించిన నీలాంబరి(Nilambari) పాత్ర మాత్రం ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్‌గా నిలిచిపోయింది.

అయితే అలాంటి గొప్ప సినిమా రిలీజ్ అయి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ మూవీకు సీక్వెల్ రాబోతున్నదని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా క్రేజీగా అప్‌డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రజనీ కాంత్ నీలాంబరి క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నరసింహ మూవీలోని పవర్ ఫుల్ పాత్రకోసం స్టార్టింగ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్(Aishwarya Rai Bachchan) అయితే బాగుంటుందని అనుకున్నాను. నా ఫస్ట్ ఛాయిస్ ఆమెనే. ఆమెతో ఈ పాత్ర చేయించడానికి చాలా ప్రయత్నించాము.

కానీ కుదర్లేదు. ఆమె ఒప్పుకుంటే 2 లేదా 3 సంవత్సరాలు వెయిట్ చేయాలని అనుకున్నాము. కానీ ఆ పాత్రపై ఆమెకు ఇంట్రెస్ట్ లేదు.దీంతో ఆమె ప్లేస్‌లో శ్రీదేవి(Sridevi), మాధురి దీక్షిత్‌(Madhuri Deekshith)ను అనుకున్నాం. కానీ ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర అవకాశం రమ్మకృష్ణకు దక్కింది’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. విశ్వ సుందరి గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. లేకుంటే టాలీవుడ్‌లో ఆమె ప్లేస్ ఎక్కడికో వెళ్లిపోయేది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Next Story