- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
War 2 : జూలై 25న అన్ని సందేహాలు తొలగిపోతాయా..?
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న వార్ 2 పై ఇప్పటివరకు అంతగా హడావుడి లేకపోవడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న వార్ 2 పై ఇప్పటివరకు అంతగా హడావుడి లేకపోవడం సినీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రమోషన్ మాత్రం ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో జరగలేదు.
ఇప్పటివరకు విడుదలైన టీజర్‌కు ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. ముఖ్యంగా దృశ్యల ఎఫెక్ట్స్ ఎన్టీఆర్ పాత్రను ఎలా చూపించారన్న దానిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ , YRF టీం ట్రైలర్‌ను పూర్తిగా మళ్లీ రీడిజైన్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్. ఈసారి ట్రైలర్‌లో హృతిక్, ఎన్టీఆర్ ఇద్దరినీ సమానంగా హైలైట్ చేయడంతో పాటు కియారా అద్వానీ పాత్రకి కూడా ప్రాముఖ్యతనిచ్చారు. అలాగే సినిమా ఎమోషనల్ కోర్‌ను ఈసారి స్పష్టంగా చూపించబోతున్నట్టు సమాచారం.
వార్ 2 ట్రైలర్ జూలై 25 (శుక్రవారం) న విడుదల కాబోతుంది. ఈ తేదీని యాదృచ్ఛికంగా ఎంచుకోలేదు YRF. ఇది భారత సినీ చరిత్రలో ఇద్దరు స్టార్‌లైన హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ల 25 ఏళ్ల సినీ ప్రయాణానికి గౌరవ సూచకంగా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశ్యంతో ప్లాన్ చేశారు. అనేక దేశాల్లో చిత్రీకరణ జరిగిన ఈ చిత్రం, మొత్తం ఆరు భారీ యాక్షన్ సన్నివేశాలు కలిగి ఉంటుంది. వీటిని ప్రత్యేకంగా థియేటర్ల కోసమే డిజైన్ చేసినట్టు సమాచారం.
ప్రీతమ్ సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ముఖ్యంగా హృతిక్ , ఎన్టీఆర్ మధ్య డాన్స్ ఫేస్-ఆఫ్ సీక్వెన్స్ ప్రేక్షకులను థియేటర్‌కు తెచ్చే ప్రధాన ఎలిమెంట్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న సినిమావిడుదలకు ముందు భారీ ప్రమోషన్ ప్రారంభించేందుకు YRF ఈ ట్రైలర్ పై భారీగా నమ్మకాన్ని పెట్టుకుంది. స్పై యూనివర్స్లో WAR 2 కీలకమైన కనెక్షన్ చాప్టర్ కావడంతో బజ్ అత్యంత కీలకం. ఇప్పుడు అసలు ప్రశ్న.. ఈ ట్రైలర్ నెగటివ్ మూడ్‌ను మార్చి, సినిమా మీద పాజిటివ్ హైప్‌ను క్రియేట్ చేయగలదా? ఈ శుక్రవారం అదే క్లారిటీ ఇస్తుంది..!






