‘వార్ 2’ ట్రైల‌ర్ అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే

by velandi.Saikiran |   (  Updated:2025-07-22 06:36:54  IST  )

జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వార్ 2 ( War 2) ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR ), హృతిక్

‘వార్ 2’ ట్రైల‌ర్ అప్‌డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
X

దిశ, వెబ్ డెస్క్ : జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వార్ 2 ( War 2) ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR ), హృతిక్ రోషన్ ( Hrithik Roshan) కలిసి నటిస్తున్న వార్ 2 సినిమా ట్రైలర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది చిత్ర బృందం. వాస్తవానికి 23వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 25వ తేదీకి డేట్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు పోస్టర్ తో పాటు అధికారిక ప్రకటన చేసింది చిత్ర బృందం. తెలుగు, తమిళం అలాగే హిందీ భాషల్లో ఈ ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నారు.

ఈ మూడు భాషలలో ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా... వార్ 2 సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి జూనియర్... ప్రతి నాయకుడి పాత్రలో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఇందులో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో కనిపించడం ఉండగా... కియారా అద్వానీ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ మూవీని... యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Twitter Link

Next Story