- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెయిటింగ్ అంటూ మెగా బ్యూటీ పోస్ట్.. అలా క్యూట్‌గా చూస్తూ మా హార్ట్‌ను మెల్ట్ చేయకంటూ కామెంట్స్..
‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఊహలు గుసగుసలాడే’(Oohalu Gusagusalade) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా(Rashi Khanna) మనందరికీ సుపరిచితమే. తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటించి మెప్పించింది. ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ మెప్పిస్తోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాల జాతరతో విందును వడ్డిస్తోంది. అలాగే పర్సనల్ విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘నా షాట్ కోసం ఇలా ఎదురు చూస్తున్నాను’ అంటూ క్యూట్ ఫొటో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అలా క్యూట్‌గా చూస్తూ మా హార్ట్‌ని మెల్ట్ చేయకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






