- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేతనాలు పెంచాల్సిందే : సినీ కార్మిక సంఘాలు
తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నా కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మిక సంఘాలు మరోసారి డిమాండ్ చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నా కార్మికులకు వేతనాలు పెంచాల్సిందేనని సినీ కార్మిక సంఘాలు మరోసారి డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో లేబర్ కమిషనర్ తో మాట్లాడిన తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ (Film Federation) యూనియన్ నాయకులు... తెలుగు సినీ కార్మికులకు స్కిల్స్ లేవనడం దారుణం అన్నారు. కాగా నేడు నిర్మాతల మండలి ప్రతినిధులు లేబర్ కమిషనర్ గంగాధర్ ను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా లేబర్ కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ... రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు.
అయితే సినీ కార్మికులకు 30% వేతనాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్టు, అదే విషయంపై నేడు నిర్మాతల మండలి ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. సినీ కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మెకు దిగగా.. 3వ రోజు సమ్మె కొనసాగుతోంది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో అన్ని రకాల షూటింగ్స్ ఆగిపోయాయి.






