పెద్ది గురించి అలాంటి కామెంట్స్ చేసిన వినాయక్.. హైప్ మరింత పెంచేసాడుగా

by Pulgam srinivas |

వివి వినాయక్ చెప్పిన మాటలతో 'పెద్ది'పై పెరిగిన అంచనాలు.

పెద్ది గురించి అలాంటి కామెంట్స్ చేసిన వినాయక్.. హైప్ మరింత పెంచేసాడుగా
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది చిత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

తాజాగా వినాయక్ మాట్లాడుతూ… ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నాడని, ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన ఒక పాట అద్భుతమైన రీతిలో శ్రోతలను ఆకట్టుకుందని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాయింట్ దాచిపెట్టారని, అది తనకు తెలుసని చెప్పారు. ఆ చిన్న పాయింట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, కేవలం తెలుగు లేదా భారతీయ ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే స్థాయిలో ఉంటుందని వెల్లడించారు.

ముఖ్యంగా ఈ సినిమాలో మానవీయత కోణం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని ఆయన చెప్పారు. ఇలా ప్రముఖ దర్శకుడు వినాయక్ ఈ సినిమా గురించి గొప్పగా చెప్పడంతో ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే శివరాజ్ కుమార్, దివ్యాంధు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మితమవుతోంది.

Next Story