VT-15: కొత్త మూవీ అనౌన్స్ చేసిన మెగా హీరో.. ఈ సారైనా హిట్ కొట్టాలంటూ కామెంట్స్(ట్వీట్)

by Gugulothu.Kavitha |   (  Updated:2025-01-19 11:26:39  IST  )

మెగా హీరో వరుణ్ తేజ్(Varu Tej) రీసెంట్‌గా ‘మట్కా’(Matka) మూవీతో బాక్సాఫీస్‌ వద్ద ఊహించని ఫ్లాప్‌ టాక్ తెచ్చుకున్నాడు.

VT-15: కొత్త మూవీ అనౌన్స్ చేసిన మెగా హీరో.. ఈ సారైనా హిట్ కొట్టాలంటూ కామెంట్స్(ట్వీట్)
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్(Varu Tej) రీసెంట్‌గా ‘మట్కా’(Matka) మూవీతో బాక్సాఫీస్‌ వద్ద ఊహించని ఫ్లాప్‌ టాక్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు పుట్టిన రోజు సందర్భంగా వరుణ్‌ తేజ్ తాజాగా ‘వీటీ15’ (VT 15) సినిమాను ప్రకటించాడు. ఈ మేరకు మేకర్స్‌ వీటీ15 సినిమా ఫస్ట్ లుక్‌ షేర్ చేశారు. ఇక ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ(Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌తో అసోసియేట్‌ అవుతూ యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నటీనటులు, షూటింగ్‌, రిలీజ్‌ అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్‌. కాగా ఈ మూవీ ఇండో-కొరియన్‌(Indo- Korean) హార్రర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతున్న ఈ సినిమా ప్రొడక్షన్ పనులు ఈ మార్చి నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

ఇక పోస్టర్‌ను చూసినట్లయితే.. డ్రాగన్ డిజైన్ ఉన్న జాడిపై కోడ్‌ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్‌ మంటలు అంటుకొని అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో కూడిన కథతో సినిమా ఉండబోతుందని ఫస్ట్ లుక్‌ హింట్ ఇచ్చేస్తుంది. వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్‌లో చూడొచ్చు. కాగా హార్రర్ కామెడీ జోనర్ సినిమాలకు మూవీ లవర్స్‌లో మంచి క్రేజ్ ఉంటుందని తెలిసిందే. మరి ఈసారైనా వరుణ్ హిట్ కొట్టాలంటూ నెటిజన్లు, అతని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click Here For Tweet..

Next Story