- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రముఖ సంస్థల చేతికి వృషకర్మ ఓవర్సీస్ హక్కులు
వృషకర్మ ఓవర్సీస్ హక్కులను ‘పీహెచ్‌ఎఫ్’ మరియు ‘ప్రత్యంగిర సినిమాస్’ సంస్థలు దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ మేకర్స్ చిత్ర ఓవర్సీస్ హక్కులకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో ‘పీహెచ్‌ఎఫ్’ మరియు ‘ప్రత్యంగిర సినిమాస్’ సంస్థలు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో, ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ఇప్పటివరకు ఈ చిత్ర విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.






