- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vivek Ranjan Agnihotri: ప్రజలు సినిమాను అర్థం చేసుకుంటే తప్పు పట్టరు.. ప్రముఖ డైరెక్టర్ వైరల్ కామెంట్స్
స్క్రీన్ రైటర్, రచయిత, ఫేమస్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకన్న వివేక్ రంజన్ అగ్ని హోత్రి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని డైరెక్టర్ సందీప్ రెట్టి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, సినిమా: స్క్రీన్ రైటర్, రచయిత, ఫేమస్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకన్న వివేక్ రంజన్ అగ్ని హోత్రి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని డైరెక్టర్ సందీప్ రెట్టి వంగాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అబ్బాయిని హైలెట్ చేస్తూ అమ్మాలను తక్కువగా చూపిస్తూ ‘యానిమల్’ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ సందీప్. దీనిపై మీ స్పందన ఏంటని వివేక్ అగ్ని హోత్రిని ప్రశ్నించగా.. వంగను సినిమా ఇండస్ట్రీలో తన ‘ఆల్టర్ ఈగో’గా అభివర్ణిస్తూ.. ‘అతను సమాజంలో కొన్ని చోట్ల జరుగుతున్న సత్యాన్ని చూపిస్తున్నాడు. అసలు ఆయన తీసే సినిమాలను ప్రజలు అర్థం చేసుకుంటే.. ఎవరూ ఒక్క మాట కూడా అనరు.
అలాగే ప్రతి చిత్రదర్శకులకు వారి స్వంత దృక్కోణం నుండి కథలు చెప్పే హక్కు ఉంది’ అంటూ నొక్కి చెప్పారు. కాగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘యానిమల్’. ఈ మూవీని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. రణబీర్ కపూర్, రష్మికా మందన్న, తృప్తి డిమ్రి, అనిల్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.






