- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం నన్ను టార్చర్ చేస్తుంది.. దుమారం రేపుతున్న ప్రముఖ దర్శకుడి కామెంట్స్
దర్శకుడు, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఎమోషనల్ అయ్యారు. ‘ది బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ రిలీజ్ లాస్ట్ మినిట్‌లో ఆగిపోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. తనపై కొందరు రాజకీయ నాయకులు కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోల్‌కతాలోని ఓ బిగ్ మల్టీప్లెక్స్ చైన్‌లో

దిశ, వెబ్ డెస్క్ : దర్శకుడు, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి ఎమోషనల్ అయ్యారు. ‘ది బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ రిలీజ్ లాస్ట్ మినిట్‌లో ఆగిపోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. తనపై కొందరు రాజకీయ నాయకులు కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోల్‌కతాలోని ఓ బిగ్ మల్టీప్లెక్స్ చైన్‌లో మూవీ ట్రైలర్ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు మేకర్స్. కానీ అక్కడకు వెళ్లేసరికి ఆ మేనేజ్మెంట్ చేతులెత్తేసింది. తమపై పొలిటికల్ ప్రెజర్ ఉందని తాము ఆతిథ్యం ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. ఒకవేళ కంటిన్యూ చేస్తే రాజకీయంగా అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని సూచించింది. ఆ తర్వాత మరో మల్టీప్లెక్స్‌ను కన్సల్ట్ చేసినా ఇదే ఆన్సర్ రావడంతో ట్రైలర్ లాంచ్ రద్దు అయింది. అంతేకాదు తనపై రూలింగ్ పార్టీ సభ్యులు కేసు పెట్టారని.. ఇది వాక్ స్వాతంత్ర్యాన్ని అణిచివేయడమే కదా అని ప్రశ్నించారు. తనను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారని అడిగారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వివేక్ అగ్నిహోత్రికి మద్దతిస్తున్నారు నెటిజన్లు. కాగా ‘ది బెంగాల్ ఫైల్స్’ 1946లో జరిగిన నోఖాలీ అల్లర్లు, డైరెక్ట్ యాక్షన్ డే వంటి ఘటనలను హైలెట్ చేయనుంది. అందుకే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం డైరెక్టర్‌ను టార్చర్ పెడుతుందనే వాదనలు ఉన్నాయి.






