దీపికకు అంత సీన్ లేదు.. ఆ ఎఫెక్ట్‌కు మాడి, మసి అయిపోద్ది.. ప్రముఖ డైరెక్టర్ సంచలన కామెంట్స్..

by Sujitha Rachapalli |

హీరోయిన్ దీపికా పదుకొణే స్పిరిట్ మూవీ ఇష్యూతో హెడ్ లైన్స్ టచ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఈ టాపిక్ కాస్త చల్లబడుతున్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆమె పరువు తీసే కామెంట్స్ చేశాడు. 2020లో జేఎన్‌యూ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న ఆమె గురించి యాంకర్ ప్రశ్నించగా

దీపికకు అంత సీన్ లేదు.. ఆ ఎఫెక్ట్‌కు మాడి, మసి అయిపోద్ది.. ప్రముఖ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్ : హీరోయిన్ దీపికా పదుకొణే స్పిరిట్ మూవీ ఇష్యూతో హెడ్ లైన్స్ టచ్ చేసింది. ఇప్పుడిప్పుడే ఈ టాపిక్ కాస్త చల్లబడుతున్న సమయంలో ప్రముఖ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఆమె పరువు తీసే కామెంట్స్ చేశాడు. 2020లో జేఎన్‌యూ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న ఆమె గురించి యాంకర్ ప్రశ్నించగా.. కచ్చితంగా ఆమెకు అక్కడ ఏం రాజకీయం జరుగుతుందో తెలియదని అభిప్రాయపడ్డాడు. కేవలం పీఆర్ టీమ్ చెప్పిందని మాత్రమే అక్కడకు వెళ్లి ఉంటుందని.. అసలు ఎక్కడికి పోతుందో.. ఏం చేస్తుందో కూడా ఆమెకు ఐడియా ఉండకపోవచ్చని అన్నాడు.

ఒకవేళ అక్కడికి వెళ్లడం ఆమె కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుందనుకుంటే కచ్చితంగా వెళ్లేది కాదని.. పీఆర్ సజెషన్‌తోనే ఛపాక్ మూవీ ప్రమోషన్స్ కోసం అక్కడకు వెళ్లిందని చెప్పాడు. పాలిటిక్స్ అనేది ఒక గేమ్.. అందులోకి వెళ్తే మాడి, మసి అయిపోవాల్సిందే. ఈ విషయం తెలిస్తే ఆమె కనీసం అటు వైపు కూడా చూసేది కాదన్నాడు. కాగా 2020లో జేఎన్‌యూ స్టూడెంట్స్‌పై గుండాల దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనకు దిగగా.. వారికి మద్దతు తెలిపేందుకు అక్కడికి వెళ్లింది దీపిక. ఇప్పటికీ ఈ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటూనే ఉంది.

Next Story