- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విడుదలకే ముందే లాభాల్లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఏకంగా అన్ని కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్
'విశ్వనాథ్ అండ్ సన్స్'కు రూ.300 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఓ హీరోకు భారీ హిట్ పడితే, అతని తదుపరి చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగడం సాధారణమే. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య విషయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. కొంతకాలం క్రితం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. సినిమా ప్రారంభమైన సమయంలో దీనిపై పెద్దగా అంచనాలు లేకపోయినా ఆ తర్వాత విడుదలైన సూర్య 'కరుప్పు' చిత్రం అనూహ్యంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఘన విజయం అందుకుంది. దీంతో సూర్య మళ్లీ ఫామ్‌లోకి రావడంతో 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రానికి విడుదలకు ముందే రూ.300 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు ఇప్పటికే లాభాల్లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






