విజువల్ వండర్ ‘భైరవద్వీపం’ మళ్లీ వస్తోంది.. బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రీట్

by Pulgam srinivas |

జూన్ 10వ తేదీన ‘భైరవద్వీపం’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

విజువల్ వండర్ ‘భైరవద్వీపం’ మళ్లీ వస్తోంది.. బాలయ్య ఫ్యాన్స్‌కు ట్రీట్
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన విజువల్ వండర్స్‌లో ఒకటైన భైరవద్వీపం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సింగితం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రోజా హీరోయిన్‌గా నటించగా, రంభ కీలక పాత్రలో కనిపించింది. 1994లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. జానపద, ఫాంటసీ అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ ఓ వీరోచిత యోధుడి పాత్రలో నటించి తన అద్భుతమైన నటనతో అభిమానులను మెప్పించారు. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

నిర్మాత బి. వెంకట్రామరెడ్డి నిర్మించిన ఈ చిత్రం కాలక్రమేణా టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది. ఇక అభిమానులకు గుడ్‌న్యూస్ ఏమిటంటే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 10న భైరవ ద్వీపం ను 4K, 2K డిజిటల్ ఫార్మాట్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ మంచి ఊపులో ఉండగా పలు క్లాసిక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నాయి. మరి భైరవ ద్వీపం రీ-రిలీజ్‌తో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.




Next Story