‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ ఫిక్స్

by Pulgam srinivas |

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రాన్ని 2026 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదల తేదీ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో తొలిసారిగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మమితా బైజు, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. సూర్య తెలుగులో నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో సూర్య తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Next Story