2 భాగాలుగా మెగాస్టార్ చిరంజీవి సినిమా?

by velandi.Saikiran |   (  Updated:2026-05-10 20:30:13  IST  )

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో వచ్చిన విశ్వంభర రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు ఇండస్ట్రీలో టాక్.

2 భాగాలుగా మెగాస్టార్ చిరంజీవి సినిమా?
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు బిగ్ అలర్ట్. ఆయన నటించిన విశ్వంభర సినిమాపై కీలక అప్డేట్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు మొదలైనట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని ఓ సినీ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయగా... దర్శకుడు వశిష్ట స్పందించారు.

అవునా...నిజమా? అంటూ సెటైరికల్ గా రియాక్ట్ అయ్యారు వశిష్ట. కానీ సింగిల్ పార్ట్ గానే వస్తుందనే దానిపైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మొద‌లైన‌ మన శంకర వరప్రసాద్ గారు ప్రాజెక్ట్ రిలీజ్ అయి బంపర్ హిట్ అందుకుంది. కానీ ఇప్పటి వరకు విశ్వంభర రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు. VFX, గ్రాఫిక్స్ తదితర అంశాల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

Next Story