- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwambhara: విడుదలకు ముందే విశ్వంభర రికార్డు..
బింబిసార (Bimbisara) సినిమాతో డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న వశిష్ట (Director Vasista).. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ సాంగ్ (Rama Rama Song) యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

దిశ, వెబ్‌డెస్క్: బింబిసార (Bimbisara) సినిమాతో డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్న వశిష్ట (Director Vasista).. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ సాంగ్ (Rama Rama Song) యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచి.. భారీ అంచనాలను నెలకొల్పింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్‌తో ఇప్పటికే సంచలనం సృష్టించింది.
‘జై శ్రీ రామ్’ (Jai Shree Ram) నినాదాన్ని ప్రతిధ్వనించే ‘రామ రామ’ సాంగ్.. విడుదలైనప్పటి నుంచి యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సాంగ్‌ని హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) సందర్భంగా ఏప్రిల్ 12, 2025న విడుదల చేయగా.. తెలుగు రాష్ట్రాల్లోని శ్రీరామ, హనుమాన్ ఆలయాల్లో పెన్‌డ్రైవ్‌ల ద్వారా పూజారులకు కానుకగా అందించేందుకు మెగా అభిమానులు చర్యలు తీసుకున్నారు. ఇది మంచి ప్రయత్నంగా ప్రశంసలు అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ గ్రేస్, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) సంగీతం, రామజోగయ్య శాస్త్రి (Rama Jogaiah Sastri) అద్భుతమైన సాహిత్యం, మాసివ్ సెట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ పాటకు శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) గాత్రం అందించడంతో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. రానున్న రోజుల్లో ఈ సాంగ్ మరింత పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.
దర్శకుడు వశిష్ట, ‘విశ్వంభర’ని తన డ్రీం ప్రాజెక్ట్‌గా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా, కునాల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డీఓపీ చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైన్ ఎఎస్ ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో రాముడి భక్తితో కూడిన ఈ పాట ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మున్ముందు ఈ చిత్రం మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






