- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు భాగాలుగా ‘విశ్వంభర’.. మెగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్?
విశ్వంభర చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: బాహుబలి సినిమా ఎప్పుడైతే రెండు భాగాలుగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటినుంచి తెలుగు మేకర్స్ కూడా రెండు భాగాలుగా సినిమాలను చిత్రీకరించడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కొంతమంది మొదటి భాగం చివరన రెండో భాగానికి హింట్ ఇస్తూ సినిమాను ముగించడం, మొదటి భాగం మంచి విజయాన్ని సాధిస్తే దానికి కొనసాగింపుగా రెండవ భాగాన్ని రూపొందించడం, లేదంటే అలాగే వదిలేయడం కూడా ఈ మధ్య సర్వసాధారణంగా జరుగుతూనే వస్తుంది. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన విశ్వంభర చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త టాలీవుడ్ సర్కిల్లో వైరల్‌గా మారింది.
త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అత్యంత భారీ గ్రాఫిక్స్‌తో రూపొందుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా విడుదలపై పెద్దగా స్పష్టత లేదు. ఇక తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. మరి నిజంగానే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.






