- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్‌తో మాస్ కా దాస్ సరికొత్త ప్రయత్నం.. ఈ సారైనా కలిసొచ్చేనా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన మెకానిక్ రాకీ, లైలా వరుస డిజాస్టర్స్‌గా నిలిచాయి.

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన మెకానిక్ రాకీ, లైలా వరుస డిజాస్టర్స్‌గా నిలిచాయి. హిట్ ఫ్లాప్ అని ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తున్నాడు. ఇక ఇప్పుడు స్క్రిప్ట్‌పై దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘ఫంకీ(Funky) చిత్రంలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుండగా.. దీనిని అనుదీప్ కేపీ(Anudeep KP) తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో పాటు ‘VS-13’లోనూ నటిస్తున్నాడు. తాజాగా, విశ్వక్ సేన్ ఓ వెబ్ సిరీస్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘డియర్ కామ్రెడ్’ ఫేమ్ భరత్ కమ్మ(Bharat Kamma)తో మాస్ కా దాస్ ఓ సిరీస్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల కాబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే ఓటీటీలో రానా దగ్గుబాటి, రానా వంటి స్టార్స్ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా వెబ్ సిరీస్‌తో రాబోతుండటం విశేషం.






