- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwak Sen: జేపీ దర్గాలో విశ్వక్ సేన్ ప్రత్యేక ప్రార్థనలు..
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గత ఏడాది మెకానిక్ రాకీ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) గత ఏడాది మెకానిక్ రాకీ, గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్, రామ్ నారాయణ్ (Ram Narayan)కాంబినేషన్‌లో ‘లైలా’ మూవీ రాబోతుంది. ఇందులో ఆకాంక్షశర్మ (Akanksha Sharma)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని పోస్టర్స్, టీజర్, ట్రైలర్ భారీ హైప్‌పు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌తో నటిస్తుండటంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ఇటీవల ‘లైలా’(Laila) ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించారు. అయితే రిలీజ్‌కు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. నిత్యం పలు ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, విశ్వక్ సేన్ తన సినిమా హిట్ కావాలని హైదరాబాద్ శివారులో జేపీ దర్గాకు వెళ్లాడు. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ దర్గాకు వస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను రాలేకపోయాను. రెండు సంవత్సరాల నుంచి ఓ మొక్కు ఉంది. లైలాకు కుదిరింది. చిన్నప్పటి నుంచి ఈ దర్గా నాకు సెంటిమెంట్‌గా మారింది. దర్శనం చాలా మంచిగ జరిగింది వచ్చినప్పుడల్లా బాగుంటుంది’’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం విశ్వక్ సేన్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






