- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రక్తపాతం.. పొలిటికల్ డ్రామాతో విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. యూత్ టార్గెటెడ్ కంటెంట్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనుదీప్ డైరెక్షన్‌లో ‘ఫంకీ’ మూవీ చేస్తున్న హీరో.. ప్యూర్ కామెడీతో సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

దిశ, సినిమా : యంగ్ హీరో విశ్వక్ సేన్ డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటున్నాడు. యూత్ టార్గెటెడ్ కంటెంట్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనుదీప్ డైరెక్షన్‌లో ‘ఫంకీ’ మూవీ చేస్తున్న హీరో.. ప్యూర్ కామెడీతో సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే తర్వాతి ప్రాజెక్ట్ మరింత విభిన్నంగా ఉండబోతున్నట్లు టాక్. ఈ సారి పొలిటికల్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారాన్ని దక్కించుకునేందుకు, అధికార పీఠాన్ని అధిరోహించేందుకు రక్తం ఎలా ఏరులైపారుతుంది? ఎంత మంది జీవితాలను మట్టు పెట్టి అందలం ఎక్కుతున్నారు? అనే స్టోరీతో ఈ మూవీ ఉండబోతున్నట్లు సమాచారం. కాగా రేపు అనౌన్స్‌మెంట్ టీజర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. ఈ మూవీ కచ్చితంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు.






