సమాధిపై మూత్రం పోసిన విశ్వక్ సేన్...

by Sujitha Rachapalli |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టీజర్ వచ్చేసింది. కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తుండగా.. సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా ‘లెగసీ’ నుంచి నూతన సంవత్సరం సందర్భంగా అప్డేట్ ఇచ్చారు.

సమాధిపై మూత్రం పోసిన విశ్వక్ సేన్...
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టీజర్ వచ్చేసింది. కలాహీ మీడియా పతాకంపై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తుండగా.. సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ డ్రామా ‘లెగసీ’ నుంచి నూతన సంవత్సరం సందర్భంగా అప్డేట్ ఇచ్చారు. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథ ఆకట్టుకుంటోంది. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్‌‌తో టీజర్ ప్రారంభమైంది. రాజకీయ క్రీడలు, ఉన్నత స్థానాన్ని పొందడానికి వేసే ఎత్తుగడలు, అవకాశవాద రాబందుల మోసం తనకు నచ్చకపోయినా.. వారసత్వాన్ని ఎవరో ఒకరి సమర్థ భుజాలపై మోయాల్సిన అవసరం ఉన్నందున, తాను ఆ బాధ్యతను చేపట్టాల్సి వచ్చిందని చెబుతాడు. తన దివంగత తండ్రి స్మారక చిహ్నాన్ని సందర్శించడానికి వెళ్తున్నట్లు విశ్వక్ సేన్ పాత్రను పరిచయం చేయగా.. అక్కడ అతను సమాధిపై మూత్ర విసర్జన చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం వైవిధ్యంగా ఉంది. ఆ తర్వాత రాజకీయ నాయకుల మధ్య అతను తుపాకీ పట్టుకొని కనిపించడం, కాల్పులు జరగడం వంటి దృశ్యాలు ఉత్కంఠను పెంచాయి. క్రూరంగా, రూఢిగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ అద్భుతంగా మెప్పించారు. ఆయన లుక్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పొలిటికల్ డ్రామాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

Next Story